శివకుమార్ రాయల్ కు నివాళులర్పించిన చిలకం మధుసూధన్ రెడ్డి

ధర్మవరం నియోజకవర్గం, ముదిగుబ్బ మండలం, పోడరాళ్లపల్లి గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్త కస్తూరి శివకుమార్ రాయల్ (32) బుధవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు మిద్దిపై నుంచి పడి మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి శివ కుమార్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి జనసేన పార్టీ తరపున10 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగింది.