గొలుగొండ మండలం జనసేన పార్టీలో చేరికలు

గొలుగొండ మండలం జోగంపేట గ్రామం నుండి జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజన్న వీర సూర్యచంద్ర సమక్షంలో వాసం వెంకటేష్ మరియు మజ్జి కుమార్ ఆధ్వర్యంలో వైసిపి మరియు టిడిపి నుండి 50 మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సూర్యచంద్ర మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ పాలక పెద్దలు అవలంబిస్తున్నటువంటి విధానాlu నచ్చక జనసేన పార్టీలో చేరుతున్నారని ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ధి ఏ మూలన కనబడటం లేదని సంక్షేమ పథకాల అమలులో వివక్ష చూపుతున్నారని అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందడం లేదని రాజకీయ పలుకుబడి ఉన్న వారికి మాత్రమే పథకాలు అందుతున్నాయి సామాన్యుడు మనకు అందాల్సిన అటువంటి సంక్షేమ పథకం కోసం వాలంటీర్స్ మరియు సచివాలయ సిబ్బంది చుట్టూ తిరిగాను కానీ స్థానిక నాయకులు కలవండి అని చెబుతున్న పరిస్థితి ఉందని అంతేకాకుండా వారు ఏ పేరు చెబితే పేరులో మాత్రమే సంక్షేమ పథకాలు అందే పరిస్థితి ఉందని ఇళ్ల పట్టాల విషయంలో కూడా అన్యాయం జరుగుతుందని అమ్ముకుంటున్న వారికి స్థలాలు అప్పజెప్పే పనిలో నిమగ్నమవుతున్నారు ఈ పరిస్థితి మారాలి అంటే గత ప్రభుత్వంలో కూడా జన్మభూమి కమిటీ పేరు చెప్పి పేదవాడికి సంక్షేమ పాలన అందకుండా రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే వారికే పథకాలు ఇచ్చే పరిస్థితి ఉండేది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా సంక్షేమ పథకాల అమలులో వివక్ష చూపుతున్న పరిస్థితి ఉందని ఈ రెండు పార్టీలు దొందూ దొందే అని సామాన్యుడికి న్యాయం జరగాలంటే జనసేన ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు ఉదీ కళ్యాణ్ చక్రవర్తి, వాసం వెంకటేష్, మజ్జి కుమార్, గండం దొరబాబు, రేగు బల్ల శివ, వాసం సత్యనారాయణ, సలాది ల ప్రసాద్, లంక సత్యనారాయణ, కొరుప్రోలు ప్రసాద్ పాల్గొన్నారు.