బాల్యం మోయలేని భారం

పుస్తకాల భారం తగ్గించాలని 2006లో ప్రభుత్వం చట్టం చేసిన నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలో యాజమాన్యాలు తమ లాభాల కోసం అవసరం ఉన్నా లేకున్నా పుస్తకాల భారం విద్యార్థులపై మోపుతున్నారు. విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో యాజమాన్యాల ఆటలు సాగుతున్నాయి.. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల జేబులకు చిల్లు పడటంతో పాటు విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రతి విద్యార్థికి లాకర్లను పాఠశాలలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఉలవపాడు జనసేన పార్టీ నాయకులు
బాలచందర్ నాయుడు డిమాండ్ చేసారు.