జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరి: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశానికి 1950 జనవరి 26న, స్వేచ్ఛ సమానత్వం ఆత్మగౌరవం లభించిన రోజు ఈ రోజు అని, అలాగే భారతదేశానికి దశా, దిశ మరిన రోజని, 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు పురస్కరించుకొని స్వేచ్ఛాయుత భారతంలో అభివృద్ధి అన్ని వర్గాలకు చేరువ కావాలని, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించేలా ప్రజలందరూ భాద్యత తీసుకోవాలని, ఎందరో మహానుభావులు త్యాగ ఫలితమే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని అటువంటి మహానుభావుడు స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మనమందరం ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, గుంటూరు జిల్లా కార్యదర్శి రావిరమా, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, ఎంటీఎంసీ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ సుభాని, ఎంటీఎంసీ ఉపాధ్యక్షులు సాదు చంద్రశేఖర్, ఎంటీఎంసీ సమన్వయ కమిటీ సభ్యులు & మంగళగిరి నియోజకవర్గ కాపు సంక్షేమ సేన అధ్యక్షులు తిరుమలశెట్టి కొండలరావు, ఎంటీఎంసీ కార్యదర్శిలు బళ్ళ ఉమామహేశ్వరావు, షేక్ వజిర్ భాష, తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి శ్రీధర్, తాడేపల్లి మండల కార్యదర్శి చాముండేశ్వరి దేవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.