ఓట్ల నమోదులో అక్రమాలు జరిగితే సహించం

గుంటూరు: ఎన్నికల కమీషన్ స్పెషల్ క్యాంపెయిన్ లో భాగంగా జరుగుతున్న ఓట్ల నమోదు ప్రక్రియను ఆదివారం గుంటూరు అర్బన్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ పరిశీలించారు. 18, 22 డివిజన్లకు సంభందించిన పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న బీ యల్ ఓ లను కలిసి ఓట్ల నమోదు ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ ఓట్ల ప్రక్రియలో అక్రమాలు జరిగితే సహించేది లేదన్నారు. ఓట్ల ప్రక్రియలో ప్రజలకున్న సందేహాలను తీర్చాల్చిన బాధ్యత బీ యల్ ఓ ల పైనే ఉందన్నారు. ఫారం 7 పై వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపధ్యంలో అధికారులు జాగ్రత్తగా విధులు నిర్వహించలన్నారు. ఓట్ల ప్రక్రియలో ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు తావు ఇవ్వద్దన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఊపిరి లాంటి ఓట్ల నమోదుని సజావుగా నిర్వహించాలన్నారు. ఓట్ల నమోదుపై ప్రజల్లో మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా అధికారులు కృషి చేయాలని నేరేళ్ళ సురేష్ కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర కార్యదర్శిలు రవీంద్ర, బాషా, టీడీపీ, జనసేన నేతలు సయ్యద్ షర్ఫుద్దీన్, షేక్ నాగూర్, ఉప్పుతల సాంబ, కోలా అంజి, పూసల శ్రీను, రమేష్, మస్తాన్ వలి, నండూరి స్వామి, చింతకాయల నరసింహరావు, కోలా మల్లి, పులిగడ్డ గోపి, తిరుమలరావు, ఎర్రబోతు వాసు, బాలు, కొలసాని బాలకృష్ణ, వడ్డె సుబ్బారావు, సాయి, పరిసపోగు రమేష్, గంధం బాబ్జి తదితరులు పాల్గొన్నారు.