మంగళగిరిలో టిడిపి రిలే నిరాహార దీక్షకు జనసేన మద్దతు

  • వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసే వెళ్తాయి

మంగళగిరి నియోజకవర్గం: ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న నిరసన దీక్షకు మద్దతుగా గురువారం సాయంత్రం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు జనసేన నాయకులతో కలిసి నిరసన దీక్షకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. అనంతరం నిమ్మరసం ఇచ్చి టిడిపి నాయకులు చేస్తున్న నిరసన దీక్షను విరమించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈరోజున చూస్తుంటే రాష్ట్రమంతా ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన దీక్షలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో టిడిపి నాయకులు చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొని జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలియజేయడం జరిగిందని, అలాగే గురువారం ఉదయం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రిలోని కర్మాగారంలో కలవడం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో వచ్చే ఎన్నికల్లో, తెలుగుదేశం జనసేన కలిసే వెళ్తాయి ప్రకటించడం జరిగింది. మాలో బలమైన ఉత్సాహాన్ని నింపుతూ రానున్న రోజుల్లో మంగళగిరి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో తెలిసేలాగా మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడేలా జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే మిత్రపక్షంలో ఉన్న పార్టీలు ఏకకంఠంతో బలమైన సిద్ధాంతాలతో ముందుకు వెళ్తూ ఈ అరాచక పాలన నుంచి ఆంధ్ర రాష్ట్ర నికి విముక్తి చేద్దామని, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లాగా రానున్న రోజుల్లో తీర్చిదిద్దితే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. ప్రశ్నించే హక్కు ఆంధ్రప్రదేశ్లో ప్రతి సామాన్య వ్యక్తికి ఉంటుంది. ఈ వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రశ్నిస్తే కేసులు పెడతాం. వ్యక్తిగత దాడులు చేస్తాం. ప్రత్యేక హోదా గురించి మాట్లాడడు, రాజధాని గురించి మాట్లాడడు, రోడ్లు మరమ్మత్తులు గాని రోడ్లు వేయటం గాని చేయడు, ఇసుక దోపిడీ, విద్యార్థులకు జాబు క్యాలెండర్ ఇంతవరకు చూపించలేదు దాదాపు 5 సంవత్సరాలు పూర్తవస్తున్న ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు చూపని ప్రభుత్వం ఈ వైసిపి ప్రభుత్వం. ఇలాగే చెప్పుకుంటా పోతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరెన్నో సమస్యలకు సమాధానం చెప్పలేని ఈ వైసీపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో జనసేన పార్టీ గట్టి సమాధానం చెప్పి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో చూసుకుంటాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, గుంటూరు జిల్లా కార్యదర్శి రావి రామా, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు, ఎంటిఎంసీ సమన్వయ కమిటీ సభ్యులు తిరుమలశెట్టి కొండలరావు, దాసరి శివ నాగేంద్రం, ఎంటిఎంసీ ఉపాధ్యక్షులు సాధు చంద్రశేఖర్, ఎంటిఎంసీ ప్రధాన కార్యదర్శి బాణాల నాగేశ్వరావు, ఎంటిఎంసీ కార్యదర్శులు బళ్ళ ఉమామహేశ్వరావు, తిరుమలశెట్టి మురళీకృష్ణ, కట్టె పోగు సురేష్, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల ఉపాధ్యక్షులు తంబి, తాడేపల్లి మండల కార్యదర్శి చాముండేశ్వరి, మంగళగిరి పట్టణ యువజన అధ్యక్షులు షేక్ కైరుల్లా, మంగళగిరి మండల యువజన అధ్యక్షులు బలుసుపాటి వెంకటేశ్వరరావు, తాడేపల్లి పట్టణ యువజన అధ్యక్షులు సింగంశెట్టి వెంకటేష్, తాడేపల్లి మండల యువజన అధ్యక్షులు తిరుమలశెట్టి నరసింహారావు, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ నందం మోహన్ రావు, యర్రబాలెం గ్రామ అధ్యక్షులు సుందరయ్య, పెనుమాక గ్రామ అధ్యక్షులు గిరిబాబు, బేతపూడి గ్రామ నాయకులు వాసా శివన్నారాయణ, పార్టీ కార్యకర్తలు, జనసైనికులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.