చైనా దూకుడు.. మొదటి ఎర్త్‌ సైన్స్‌ ఉపగ్రహా ప్రయోగం

చైనా శుక్రవారం మొదటి ఎర్త్‌ సైన్స్‌ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. తైయువాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి లాంగ్‌ మార్చ్‌-6 కేరియర్‌ రాకెట్‌ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎర్త్‌ సైన్స్‌ ఉపగ్రహమైన గుయాంగ్ముని ఐక్యరాజ్య సమితి 2030 సుస్థిర అభివృద్ధి ఎజెండాకు అంకితం చేశారు. ఐక్యరాజ్య సమితిలో చైనా పీపుల్స్‌ రిపబ్లిక్‌ చట్టబద్ధమైన హక్కులు పునరుద్ధరించబడి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఉపగ్రహాన్ని అంకితమిచ్చారు. చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అభివృద్ధిపరిచిన ఈ ఉపగ్రహం ఇంధన వినిమయం, నివాసాల నమూనాలు, తీరప్రాంతాల్లో జనాభా వంటి అంశాలపై కచ్చితమైన విశ్లేషణ అందిస్తుంది. సుస్థిర అభివృద్ధి సూచికలకు డేటాను అందచేస్తుంది. లాంగ్‌ మార్చ్‌ రాకెట్‌ సిరీస్‌లో శుక్రవారం నాటి ప్రయోగం 395వది.