Kadapa: వైసిపి కంచుకోట కడపలో వైసిపి నుండి జనసేనలో చేరిన 200 కుటుంబాలు

కడప నెహ్రు నగర్ కు చెందిన ప్రముఖ వైష్ణవి మిల్క్ డీలర్ వ్యాపారి శ్రీబోరెడ్డి నాగేంద్ర మరియు కడప పరిధిలోని అతని సన్నిహితులు మిత్రులు శ్రేయోభిలాషులు కడప జనసేనపార్టీ కార్యాలయంలో జనసేనపార్టీ పెద్దల సమక్షంలో జనసేనపార్టీలో చేరారు. వీరిని జనసేనపార్టీ సీనియర్ నాయకులు శ్రీ పివిఎస్ మూర్తి, రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీవిజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు శ్రీ తాతం శెట్టినాగేంద్ర, శ్రీ ముఖరం చాంద్, కడప నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ సుంకర శ్రీనివాస్, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన బోరెడ్డి నాగేంద్ర మాట్లాడుతూ జనసేనపార్టీ అధినేత గౌ శ్రీ పవన్ కల్యాణ్ ఆశయాలు ప్రజా ఉద్యమాలు ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ ఆప్యాయత నిబద్ధత స్ఫూర్తిగా జనసేనపార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు నేను మరియు కడప నగర పరిధిలోని నా సన్నిహితులు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు అందరూ కలిసి జనసేనపార్టీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని నన్ను నా బృందాన్ని ఈరోజు జనసేనపార్టీలోకి ఆహ్వానించిన ప్రతి ఒక్క జనసేనపార్టీ పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ పవన్ కల్యాణ్ ఆశయాలను జనసేనపార్టీ సిద్ధాంతాలను జనసేనపార్టీ చేస్తున్న ప్రజా ఉద్యమాలను మా వంతుగా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి తీసుకు వెళ్లి కడప నగరంలో జనసేనపార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఈరోజు ఈ వేదికపైన జనసేనపార్టీ పెద్దలు చేసిన మార్గనిర్దేశాలు సూచనలు సలహాలు పాటిస్తూ పార్టీలో ఒకరికొకరు సహకరించుకుంటూ రాబోయే రోజుల్లో జనసేనపార్టీ ద్వారా జరగబోయే ఎటువంటి కార్యక్రమాలు అయినా విజయవంతం చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినంటువంటి పెద్దలందరికీ నా తరపున మరియు నా మిత్ర బృందం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున, మహేష్, అరవింద్, చంద్రశేఖర్, గౌస్, రవికుమార్, రమణ, శ్రీను, చంద్ర, ఇంకా 190 మంది చేరిన వారు పాల్గొన్నారు.