Chintalapudi: కనీసం గోతులైనా పూడ్చాలని నిరసన తెలిపిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య

లింగపాలెం మండలంలో రోడ్లు పూర్తిగా ఛిద్రమై పెద్ద పెద్ద గోతులు పడి ప్రజలు నానా అవస్థలుపడుతున్నారని, అందువలన ప్రభుత్వం కల్పించుకొని కనీసం గోతులైనా పూడ్చమని కోరుతూ జనసేనపార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్మాజీగూడెం మెయిన్ రోడ్డులో నిరసన దీక్ష చేయటం జరిగింది. ఈ నిరసన దీక్షను ఉద్దేశించి
జనసేనపార్టీ చింతలపూడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలోని లింగపాలెం, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, చింతలపూడి మండలాల్లోని అన్ని రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, రోడ్ల గురించి ప్రజలు పాలకులను, ఎన్నికైన అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ఎన్ని తిట్లు తిట్టినా చెవిటి వాళ్ళలా నటిస్తున్నారు గాని వాళ్లలో స్పందన లేదని చెప్పారు. అందుకే ప్రజలు మేల్కొని ప్రభుత్వాన్ని నిద్రలేపాలని, ప్రజలు సమస్యలు సమస్యల పరిష్కారం కొరకు రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లోచింతలపూడి పట్టణ కమిటీ అధ్యక్షులు తూము నరేష్, లింగపాలెం మండల నాయకులు మాదాసు కృష్ణ, తాళం మల్లేశ్వరరావు, పంది మహేష్ బాబు, పోలిశెట్టి నాగరాజు, పంది సతీష్, యన్నంశెట్టి శ్రీనివాస్, మేతిపల్లి వెంకట్, బర్మా వెంకన్న మరియు బిజెపి నాయకులు కుర్రా వియస్వి ప్రసాద్, ఎంవి సత్యనారాయణ, కొత్తూరి పుల్లయ్యలు పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ లింగపాలెం మండల నాయకులు సంఘీభావం తెలిపిపారు.