పూతలపట్టు: జనసేన 2023 క్యాలెండర్ ఆవిష్కరణ

పూతలపట్టు: జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ హరి ప్రసాద్ చేతుల మీదుగా, జిల్లా నాయకులు మరియు మండల నాయకుల ఆధ్వర్యంలో 2023 క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండల నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది. ఈ క్యాలెండర్‌ను తవణంపల్లి మండలంలో ప్రతి గ్రామంలోను అందించి, 2023లో మరింత బలంగా ప్రజలలోకి పార్టీని తీసుకెళ్ళి, రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చెయ్యడమే లక్షంగా కలిసి పనిచెయ్యాలని పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు వీరమహిళలు పాల్గొన్నారు.