చింతపల్లి వచ్చారు గిరిజనులకు ఏమి హామీ ఇచ్చారు?

  • సీఎం పర్యటనతో గిరిజనులకు నిష్ప్రయోజనమే

పాడేరు నియోజకవర్గం: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కేంద్రానికి ట్యాబుల పంపిణీకై వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివాసులకు ఇచ్చిన హామీ ఏమిటని పాడేరు జనసేన పార్టీ ఇంచార్జ్ వంపురి గంగులయ్య ప్రశ్నించారు. ట్యాబుల పంపిణీ కొరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చింతపల్లి రావాలా? ట్యాబుల పంపిణీ మంత్రి ద్వారా అయినా చేపట్టవచ్చు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్యాబుల పంపిణీకై చింతపల్లి వచ్చారు. అయితే గిరిజనులకు ఏమి హామీ ఇచ్చారు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి గిరిజన ప్రాంతానికి వచ్చినప్పుడు గిరిజనులకు ప్రత్యేకమైన రాయతీలుగాని, ప్రత్యేకమైన వరాలు గాని ఇవ్వాలి. మైనింగ్ సంబంధించిన ప్రాజెక్ట్ ల మీద స్పష్టత లేదు. బోయలు, బెంతు ఒరియాలను గిరిజన జాబితాలో చేర్చాలని ప్రవేశపెట్టిన తీర్మానంలో దాని కొరకు స్వష్టత లేదు, కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తూ ట్యాబుల పంపిణీకై గిరిజన ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రి వల్ల గిరిజనులకు ప్రయోజనం ఏమి ఉన్నదని ప్రశ్నించారు. దుబారా ఖర్చులు చేస్తూ ప్రచారాలు చేసుకోవడం తప్ప గిరిజనులకు ఒరిగేందేమి లేదన్నారు. మాకు కావాల్సింది ప్రసారాలు కాదని, మా చట్టాలకు రక్షణ కావాలి, మాకు స్పష్టమైనటువంటి హామీలు కావాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పర్యటనతో గిరిజనులకు నిష్ప్రయోజనమే అని అందుకుగాను గిరిజనులుని తీవ్ర నిరాసపరిచిందన్నారు. ఆయన తెలిపారు. నిజానికి గిరిజన జాతిపై కుట్రచేసిన వైసీపీ ప్రభుత్వానికి ఈ ప్రాంతంలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదన్నారు. గిరిజనులు అమాయకులు ఏమి చెప్పిన నమ్ముతారు కాబట్టే మరొకసారి ఓట్లు దండుకోవడానికి మభ్యపెట్టే ప్రయత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమం పెట్టుకున్నారేమోనన్నారు ఇదిలా ఉంటే గిరిజన ప్రాంతంలో జనసేనపార్టీ విస్తరించడం స్థానిక వైసీపీ నాయకులకు మింగుడు పడటం అందుకోసమే మరోసారి మోసపుచ్చే ప్రయత్నాల్లో భాగంగానే ఈ సారి సీఎం గారి సభ ఈ ప్రాంతంలో నిర్వహించారన్నారు. వచ్చారు కానీ రోడ్ల పరిస్థితి అర్ధరాత్రికి గుంతలు మూసే కార్యక్రమాలు చేశారు స్వయంగా చూసి ఉంటే బాగుండెదన్నారు.