డా.వంపురు గంగులయ్యని సత్కరించిన చింతూరు మండల జనసేన

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, చింతూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు మడవి రాజు వీరమహిళలు, జనసైనికులతో సంయుక్తంగా సోమవారం జనసేనపార్టీ అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.వంపురు గంగులయ్యని మర్యాదపూర్వకంగా కలసి దుశ్శాలువ కప్పి సన్మానం చేశారు. అనంతరం పలు పార్టీ పరమైనటువంటి నిర్మాణాత్మక విషయాలు, క్షేత్రస్థాయి బలోపేత కార్యాచరణ, నియోజకవర్గంలో పలు సమస్యలపై జనసేనపార్టీ పాడేరు అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ డా.వంపురు గంగులయ్యతో చర్చించడమైనది. అలాగే రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటించి జనసైనికులకు దిశానిర్దేశం చేయాలని కోరాడమైనది. అందుకుగాను డా.గంగులయ్య సమ్మతం తెలిపి జనసేనపార్టీ నిర్మాణాత్మక కార్యక్రమాల్లోకి పార్టీ బలోపేతానికి జనసేనాని ఆశయసాధనకు నా వంతు కృషిచేస్తూ నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటానని డా.గంగులయ్య చెప్తూ త్వరలోనే మీ నియోజకవర్గంలో పర్యటిస్తామని తెలిపారు.