విష్ణుతో పాటు గెలిచిన సభ్యులకు శుభాకాంక్షలు తెలిజేసిన చిరంజీవి

హోరాహోరీగా సాగిన మా ఎన్నికలలో మంచు విష్ణు తన ప్రత్యర్థి ప్రకాష్‌రాజ్‌పై 107 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాబుమోహన్‌పై శ్రీకాంత్‌, జనరల్‌ సెక్రటరీగా జీవితపై రఘుబాబు విజయాన్ని అందుకున్నారు. ట్రెజరర్‌గా శివబాలాజీ గెలుపొందారు. జాయింట్‌ సెక్రటరీలుగా ఉత్తేజ్‌, గౌతమ్‌రాజు గెలుపొందారు.

మాకి ఎన్నికైన కొత్త ప్రెసిడెంట్ మంచు విష్ణుకి చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా శుభాకంక్షలు తెలియజేశాడు. ఈ ఎన్నికలో గెలిచిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టులందరి సంక్షేమానికి పాటు పడుతుంది అని ఆశిస్తున్నా అని అన్నారు.మా ఇప్పటికీ, ఎప్పటికీ ఒకటే కుటుంబం, ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే. ఆ స్ఫూర్తి తోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను అని అన్నారు.

గత రెండు నెలలుగా మా ఎలక్షన్స్ పేరుతో జరిగిన వివాదాలపై కూడా స్పందించాడు చిరంజీవి. అల్లర్లతో మా పరువు తీయొద్దని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని మా సభ్యులకు సూచించాడు. మనదంతా వసుదైక కుటుంబమని పేర్కొన్నారు. వివాదాలతో అందరి ముందు చులకన కావద్దన్నాడు. పదవులు తాత్కాలికమని.. చిన్న చిన్న పదవుల కోసం ఇగోలకు పోవద్దని సలహా ఇచ్చాడు. ఎవరి వల్ల ఈ వివాదాలు పుట్టాయో వారిని దూరంగా పెట్టాలని సలహా ఇచ్చాడు.