బిగ్‌ బికి చిరు బర్త్‌ డే విషెష్‌

నేడు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌డే విషెష్‌ చెబుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలను తెలియజేశారు. “నా ప్రియమైన పెద్దన్న, ఇండియన్‌ సినిమాకు బిగ్ బి, టాలెంట్‌ పవర్‌ హౌస్‌, నా గైడింగ్‌ లైట్‌, వన్‌ అండ్‌ ఓన్లీ అమితాబ్‌గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రేక్షకులను ఆనందపరుస్తూ, మమ్మల్ని ఉత్తేజపరుస్తూ ఇలాగే మరెన్నో పుట్టినరోజులను జరుపుకోవాలని కోరుకుంటున్నాను” అన్నారు.