స్వామిత్వ పథకం కింద ఆస్తి కార్డుల పంపిణీ

కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు సాధికారికత కల్పించేందుకు సర్వే ఆఫ్ విలేజెస్, మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ (స్వామిత్వ) పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా ప్రాపర్టీ కార్డుల పంపిణీని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం వీడియో కాన్ఫరెన్సె ద్వారా ప్రారంభించారు. ఈ పదకాన్ని ప్రారంబించిన మోడీ గ్రామీణ భారతం సాధికారికత సాధించడంలో ఈ పథకం చరిత్రాత్మకమైందని మోడీ అన్నారు.

స్వామిత్వ పథకo లో గ్రామీణ ప్రజల ప్రాపర్టీని ఆర్థిక సంపదగా గుర్తిస్తారు. దీంతో వారు బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడంతోపాటు ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి అవకాశం లభించనుంది. ఈ పథకం ద్వారా ఆరు రాష్ట్రాల్లోని 763 గ్రామాలకు చెందిన ప్రజలు లబ్ది పొందుతున్నట్లు కేంద్ర పేర్కొంది. దాదాపు లక్ష మంది లబ్దిదారుల మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ ద్వారా లింక్ పంపించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. వీరికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రాపర్టీ కార్డులను పంపిణీ చేయనున్నాయి. ప్రజల ఆస్తుల వివరాలతోపాటు రోడ్లు, చెరువులు, పార్కులు, దేవాలయాలు, అంగన్‌వాడీ, హెల్త్ సెంటర్, పంచాయతీ కార్యాలయం లాంటి వివరాలన్నీ స్వామిత్వ సర్వేలో చేర్చనున్నారు.