చిరంజీవి యువత అధ్వర్యంలో డాన్స్ పోటీల నిర్వహణ

  • మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో 5వ రోజు డాన్స్ పోటీలు నిర్వహణ
  • విజయనగరం జిల్లా చిరంజీవి యువత &అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం ఆధ్వర్యంలో

విజయనగరం: పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లోని భాగంగా ఆదివారం ఉదయం విజయనగరం జిల్లా చిరంజీవి యువత మరియు అంజనీపుత్ర చిరంజీవి బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపకడు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో కె.ఎల్. పురంలో ఉన్న రితిక్ డాన్స్ స్టూడియోలో నిర్వహించారు. ఈ డాన్స్ పోటీలకు న్యాయ నిర్ణేతులుగా ప్రముఖ డాన్స్ మాస్టర్లు రితిక్ మాస్టర్, జనసేన యువ నాయకులు చందు మాస్టర్ వ్యవహరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ యువవ్యాపార వేత్త, సంఘసేవకులు కోరాడ గోవింద్, శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు చెల్లూరి శ్రీనివాసరావు(సి.హెచ్. రమణ) హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన కొరాడ గోవింద్, సి.హెచ్. రమణ మాట్లాడుతూ సినీపరిశ్రమకు రారాజు మెగాస్టార్ చిరంజీవి అని, డాన్స్ లకు మెగాస్టార్ చిరంజీవి మహారాజని, ఇటువంటి మెగాస్టార్ చిరంజీవి ని ఆదర్శంగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయటం ఎంతో అభినందనీయమని, పిల్లల్లో వారి నైపుణ్యతలను వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగ పడతాయని అన్నారు. పోటీల్లో పాల్గొన్న సుమారు నలబైమంది ప్రతీ విద్యార్థినీ విద్యార్థులకు యువ వ్యాపార వేత్త, సంఘసేవకులు కోరాడ గోవింద్ స్పాన్సర్ చేసిన స్కూల్ బ్యాగ్స్ ను బహుమతులుగా అందించారు.
కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత ప్రతినిధులు, జనసేన యువ నాయకులు ముదిలి శ్రీనివాసరావు, సన్నిధి మధుసూధనరావు, సాయి, రాము నాయుడు, శ్రీను, కళ్యాణ్, కృష్ణ పాల్గొన్నారు.