పెదమరికి గ్రామ పంచాయతీలో జనసేన గ్రామబాట

పార్వతీపురం, పెదమరికి గ్రామ పంచాయతీలో పార్వతీపురం మండల అధ్యక్షురాలు ఆగూరు మని ఆధ్వర్యంలో జనసేన గ్రామబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు, అక్కివరపు మోహన్ రావు మరియు రాజాన బాలు పాల్గొనడం జరిగింది. ఈ జనసేన గ్రామబాటలో పంచాయితీలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొత్తవూరులో ఆగిన జగనన్న ఇల్లు సంగతి, అలాగే పంచాయతీ నిధుల దుర్వినియోగం గూర్చి, చినమరికి రోడ్డు సమస్య గురించి, మౌళిక సదుపాయాల కల్పన గూర్చి అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ ప్రజలు సహకరిస్తే పై సమస్యలు పరిష్కరించే వరకూ ఉపక్రమించేది లేదని పెర్కోన్నారు. అభివృద్ధికి నోచుకోని గిరిజన గ్రామాలైన కొత్తవూరు, శివన్నదొరవలస, చందలింగి గ్రామాలను, నిలిచిపోయిన పెదమరికి సచివాలయం నిర్మాణ పనులు పూర్తి చేయాలని, అలాగే చినమరికి రోడ్ సమస్యను పూర్తి చేయకపోతే, వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. ఈ గ్రామబాట కార్యక్రమంలో బలిజిపేట మండల అధ్యక్షులు బంకురు పోలినాయుడు, కొమరాడ మండల అధ్యక్షులు శ్రీకర్, బొబ్బిలి మండల అధ్యక్షులు గంగాధర్, జిల్లా నాయకులు గుండ్రెడ్డి గౌరీ శంకర్, చిట్లి గణేశ్వరరావు, కర్రీ మణికంఠ, అల్లు రమేష్, పైల రాజు, ఖాతా విశ్వేశ్వరరావు, అక్కన భాస్కరరావు, అన్నా బత్తుల దుర్గాప్రసాద్, సురేష్, దుర్గా, కనకరాజు, స్వామి నాయుడు, అప్పలనాయుడు, ఇప్పిలి పోలినాయుడు, మీసాల వెంకటరమణ పురుషోత్తం, పడాల ఈశ్వర్, కేశవరావు, మహేష్, శివ, సాయి, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాగే రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం అందరం కలిసి పని చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న కురుపాం నియోజకవర్గం జనసైనికులకి, బొబ్బిలి నియోజకవర్గం జనసైనికులకి, మరియు బలిజిపేట, సీతానగరం మండల జనసైనికులకి పేరు పేరునా పార్వతీపురం మండల జనసేన తరుపున ధన్యవాదములు తెలిపారు.
జై… జనసేన.జై..! జై..! జనసేన, పవన్ రావాలి-వైసీపి పోవాలి. పవన్ రావాలి-పాలన మారాలి అంటూ నినాదాలతో హోరేత్తించారు.