మెగాస్టార్ గోత్రనామాలతో పూజలు నిర్వహించిన చిరంజీవి యువత

మాజీ రాజ్యసభ సభ్యులు, పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా జిల్లా చిరంజీవి యువత మరియు అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఉదయం విజయనగరం పట్టణంలో, అయ్యకోనేరు గట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చిరంజీవి గారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు), చిరంజీవి యువత కార్యదర్శి, జనసేన నాయకులు పిడుగు సతీష్, చిరంజీవి యువత గౌరవ సలహాదారులు, జనసేన నాయకులు డాక్టర్ ఎస్. మురళీమోహన్, ఎస్. కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *