వైసీపీ ప్రజా కంఠక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయటమే అందరి లక్ష్యం కావాలి

  • పదేళ్ల అధికారాన్ని దుర్వినియోగం చేసిన ముస్తఫా
  • తాగటానికి గుక్కెడు రక్షిత మంచినీరు ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ పాలన
  • జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు, వైసీపీ నియంతృత్వ ధోరణిపై ప్రజల్లో సైతం అగ్రహజ్వాలాలు పెల్లుబికుతున్నాయని, వైసీపీ ప్రజా కంఠక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయటమే అందరి లక్ష్యం కావాలని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా 55 డివిజన్ అధ్యక్షుడు కొనిదేటి కిషోర్ ఆధ్వర్యంలో డొంకరోడ్డు పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రజలతో ముఖాముఖి అయ్యారు. స్థానిక సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యుడు ముస్తఫాకి పదేళ్లు శాసనసభ్యుడిగా అధికారం ఇచ్చినా కనీస మౌళిక సదుపాయాలు కల్పించలేకపోయాడని విమర్శించారు. కనీసం ప్రజలకి తాగేందుకు రక్షిత మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. డయేరియాతో ఇప్పటివరకు ముగ్గురు మృత్యువాత పడితే ముస్తఫా ఎక్కడ దాక్కున్నాడని మండిపడ్డారు. రకరకాల డ్రామాలాడుతూ నటనలో కమల్ హాసన్ ని మించిపోయాడని ఎద్దేవా చేశారు. ఎన్నికలు అతి సమీపంలోనే ఉన్నాయని ప్రజలెవరూ కూడా ఏమరుపాటుగా ఉండొద్దన్నారు. మూడు నెలల్లో రాష్ట్రంలో రాజకీయంగా పెనుమార్పులు రానున్నాయని. మంచి పాలకులను ఎన్నుకోవాలని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నేరేళ్ళ సురేష్, జిల్లా అధికార ప్రతినిధి ఆల్ల హరి, టిడిపి నాయకులు సౌపతి రత్నం, టిడిపి డివిజన్ ప్రెసిడెంట్ నవీన్, టి.ఎన్.ఎస్.ఎఫ్ ఉప్పుటూరి వెంకట్, పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు, కార్పొరేటర్లు దాసరి లక్ష్మి దుర్గ, యర్రంశెట్టి పద్మావతి, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట మల్లిక, బందెల నవీన్ బాబు, స్థానిక డివిజన్ అధ్యక్షులు కొడిదెటి కిషోర్, కార్మిక నాయకుడు సోమి ఉదయ్, నగర ప్రధాన కార్యదర్శులు సూరిశెట్టి ఉదయ్, యడ్ల నాగమల్లేశ్వరరావు, పావులూరి కోటేశ్వరరావు, తిరుమలశెట్టి కిట్టు, నగర కార్యదర్శి కలగంటి త్రిపురా కుమార్, జలగం మల్లేశ్వరి , 3వ డివిజన్ అధ్యక్షులు మాదాసు శేఖర్, 8వ డివిజన్ అధ్యక్షులు జడ సురేష్, గడదాసు అరుణ పాకనాటి రమాదేవి, శ్రీపతి భూషయ్య, మహంకాళి శ్రీనివాస్ రావు, నాదెండ్ల రాము, మెహబూబ్ బాషా, 51వ డివిజన్ అధ్యక్షులు గాజుల రమేష్ , 9వ డివిజన్ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్, 44వ డివిజన్ అధ్యక్షులు పవన్ వెంకి, 4వ డివిజన్ ప్రెసిడెంట్ శాంతి కుమార్, 56 వ డివిజన్ ప్రెసిడెంట్ పులిగడ్డ నాగేశ్వరరావు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.