చిరంజీవి సామాజిక సేవలు చారిత్రాత్మకం: డిఎంఆర్ శేఖర్

మెగాస్టార్ చిరంజీవి సమాజానికి చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అమలాపురం పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జి డిఎంఆర్ శేఖర్ అన్నారు. పి. గన్నవరం మూడు రోడ్ల కూడలిలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను మంగళవారం చాకలిపాలెం చిరు పవన్ సేవాసమితి అధ్యక్షుడు కందాల చంటి ఆధ్వర్యంలో చిరంజీవి అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమాన సంఘాల నాయకుడు గుండా బత్తుల తాతాజీ అధ్యక్షతన నిర్వహించిన ఈ వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలుగు సినీ ఇండస్ట్రీలో కథానాయకుడుగా ఎదగడానికి చిరంజీవి ఎన్నో కష్టాలు పడ్డారని, పేదల కష్టాలు తెలిసిన ఆయన కరోనా సమయంలోనూ, విపత్తుల సమయంలోనూ తన వంతు సహకారం ఎప్పుడు చేస్తూనే ఉన్నారన్నారు. చిరంజీవి యొక్క సేవా స్ఫూర్తితోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని తెలిపారు. ఆయన యొక్క ఆశయ సాధనకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం కందాల చంటి సమకూర్చిన దుప్పట్లను స్థానిక పేద ప్రజలకు, రిక్షా కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు డిఎంఆర్ శేఖర్ అందజేశారు. చిరంజీవి వీరాభిమాని అయిన పితాని శ్రీనును డిఎంఆర్ శేఖర్ చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు ఏడిద శ్రీను, మాజీ ఎంపిడిఓ ఐఈ కుమార్, సర్పంచ్ లు యల్లమెల్లి కృష్ణవేణి చిట్టిబాబు, పసలపూడి రామకృష్ణ జనసేన పార్టీ నాయకులు శిరిడినీడి వెంకటేశ్వర రావు, వాసంశెట్టి కుమార్, జెఎస్ఆర్, సాదనాల జెడి, అడబాల తాతకాపు, అన్నాబత్తుల అనుబాబు, ఆధిమూలం సూరయ్య కాపు, కంకిపాటి నరసింహారావు, కొమ్ముల జంగమయ్య, కర్రి బాబు రావు, షేక్ దొరబాబు, తాటికాయల వెంకటేష్, ఏడిద సుభాష్ తదితరులు పాల్గొన్నారు.