అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన చిర్రి బాలరాజు

పోలవరం నియోజకవర్గం, వేలేరుపాడు మండలంలోని కన్నయిగుట్ట గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇరవై ఒక్క ఇళ్ళు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలవరం జనసేన ఇంఛార్జి చిర్రి బాలరాజు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించడం జరిగింద్. అదేవిధంగా స్థానిక రెవెన్యూ అధికారులు, మండల అధికారులను కలిసి అగ్నికి ఆహుతి అయిన కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ప్రస్తుతం వారం రోజులు పాటు వారికి ప్రభుత్వమే బాధ్యత వహించి భోజన సదుపాయాలు కల్పించాలని కోరారు. బాధిత కుటుంబాలను జనసేన తరుపున ఆదుకుంటామని చెప్పారు. అదేవిధంగా అగ్నికి ఆహుతి అయి పూర్తిగా కాలిపోవడంతో కట్టుబట్టలతో ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం అని అన్నారు. జనసేన ఇంఛార్జి బాలరాజుతో పాటు వేలేరుపాడు మండల అధ్యక్షులు గణేశుల ఆదినారాయణ, మండల ప్రధాన కార్యదర్శులు కొవ్వల క్రాంతి కుమార్, దేవిరెడ్డి సుధాకర్, కుడియం భాను, సవలం వంశీతో పాటు జీలుగుమిల్లి మండల అధ్యక్షులు పసుపులేటి రాము తదితరులు పాల్గొన్నారు.