చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కొత్త మూవీ

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా మూడవ సినిమా పూజా కార్యక్రమాలతో ఈ రోజు ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ సన్నిహితుడైన రామ్ తాళ్లూరికి చెందిన ఎస్ఆర్‌టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో రమణ తేజ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం ఎస్ఆర్‌టీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న 6వ సినిమా. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ కూకట్ పల్లిలోని తులసి వనం శ్రీవెంకటేశ్వర దైవ సన్నిధానంలో జరిగాయి. ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సాయిరిషిక సమర్పణలో రజనీ తాళ్లూరి, రవి చింతల ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

కల్కి సినిమాకు రచయితగా వ్యవహరించిన సాయి తేజ్ ఈ సినిమాకు కథను అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం మహతి సాగర్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఛలో మరియు భీష్మ సినిమాలు మ్యూజికల్ గా సక్సెస్ అయ్యాయి. మరోసారి ఆయన ఈ సినిమాతో ఒక మంచి మ్యజికల్ ఆల్బంను ఇస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు. దీపావళి కానుకగా నవంబర్ 14న టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నాం అంటూ నిర్మాత రామ్ తాళ్లూరి అన్నారు. నేడు జరిగిన పూజా కార్యక్రమాలకు వెంకీ కుడుముల.. ప్రణీత్.. వేణు ఉగుడులలు హాజరు అయ్యి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.