ప్రమాదకరంగా మారిన చిరునోముల రోడ్డు

  • పట్టించుకోని అధికారులు
  • తీవ్రంగా ఖండిస్తున్న జనసేన పార్టీ బోనకల్ మండల నాయకులు

మదిర, ఈ సందర్భంగా బోనకల్ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లూరి డేవిడ్ మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో చిరునోముల, చొప్పకట్లపాలెం రోడ్డు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో అధికారులు ఏమి పట్టించుకోవడంలేదని అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోడ్డుపై ఎలాంటి స్పందన లేకుండా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చిరునోముల,చొప్పకట్లపాలెం గ్రామ ప్రజలు బోనకల్ రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వాహనదారులు వాపోతున్నారు.ఈ ప్రభుత్వం కూడా రోడ్ల గురించి పట్టించుకోకుండా ఇలా ఎంతోమంది ఉద్యోగులు కూలీలు పనులు చేసుకునే వారు ఆ రోడ్లపై బైకులు తోలాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్లపై గత ఐదు సంవత్సరాలుగా కొన్ని ఆక్సిడెంట్లు అయ్యి కాళ్లు చేతులు ఇరగటం జరిగాయి.ఈ ఏరియాలోకి ఎదురెదురుగా ఆటోలు వస్తే ఇబ్బందిపడేవాళ్లు. ఇలాంటిది గత మూడు సంవత్సరాలుగా 40 టన్నుల లారీలు రావడంతో ఈ రోడ్లు ఆగమయ్యాయని వాహనదారులు చెబుతున్నారు. ఆర్.ఎం.బి అధికారులు మట్టి పోయడం వర్షాలు వచ్చి ఆ మట్టి ఉన్న గుంటలలో నీరు నిలిచిపోతున్నాయని వాహనదారులు కూలీలు వాపోతున్నారు.తక్షణమే ఈ ప్రభుత్వం ఈ రోడ్ల గురించి ఆలోచించాలని ఈ రెండు గ్రామాల ప్రజల ఇబ్బందులను గ్రహించి రోడ్డు మరమ్మతులు చేయాలని చేయని యెడల ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానిలో, మండల ఎగ్జిక్యూటివ్ నెంబర్, ఎస్కే జానీ పాషా,ఖమ్మం జిల్లా జనసేన విద్యార్థి విభాగ ఎగ్జిక్యూటివ్ నెంబర్ గంధం ఆనంద్, మరియు జనసేన పార్టీ బోనకల్లు మండల నాయకులు, వాహనదారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.