అధికారమే పరమావధిగా మూడు ముక్కలైన చిత్తూరు జిల్లా..!: తులసి ప్రసాద్

అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ కొత్త రాగం పలికిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం, ఏ అభివృద్ధి ప్రాతిపదికన చిత్తూరు జిల్లాను విభజించినదో ప్రజలకు తెలియడం లేదని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సంస్థలు, విద్యాలయాలు అభివృద్ధి చేసినటువంటి ప్రధాన నగరాలు చిత్తూరు జిల్లా నుండి విభజించబడ్డాయి.

ఏడు నియోజకవర్గాలతో ఏర్పడిన చిత్తూరు అనేక సమస్యలను అనుభవించవలసిందే. ఈ ప్రాంతం నుండి 30- 40 సంవత్సరాల నుండి ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్న రాజకీయ నాయకులు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు చిత్తూరు జిల్లాలో శ్రీకారం చుట్టు లేక పోయారు. భావి తరాల భవిష్యత్తుకు ఒక అవకాశాన్ని, ఒక ఆశను కల్పించలేకపోయారు. గొప్ప విద్యను అభ్యసించాలన్న, గొప్ప ఉద్యోగం చేయాలన్న, రైతు కడుపునిండాలన్న, పక్క జిల్లాకు, పక్క రాష్ట్రాలకు, చిత్తూరు జిల్లా వాసులు వెళ్ళ వలసిన పరిస్థితి ఏర్పడింది.

ఇకనైనా ప్రజాప్రతినిధులు మేల్కొని జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తారని, ప్రజలకు మెరుగైన విద్య వైద్య, వ్యవసాయ సదుపాయాలు కల్పిస్తారని కోరుకుంటున్నానని తులసి ప్రసాద్ తెలియజేసారు.