మండల అధ్యక్షులకు దిశానిర్దేశం చేసిన చిత్తూర్ జిల్లా అధ్యక్షులు

నగరి నియోజకవర్గం నుండి మండల అధ్యక్షులుగా ఎన్నుకోబడిన వారు, పీలేరు నియోజకవర్గం నుండి జనసేన నాయకులు, జనసైనికులు… జనసేన ఫాఛ్ మెంబెర్ చిత్తూర్ జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మండల అధ్యక్షులతో కలిసి జనసేన పార్టీని మండల స్థాయిలో ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళాలని, శ్రీ హరిప్రసాద్ దిశా నిర్దేశం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, జిల్లా కమిటీ సంయుక్త కార్యదర్శి బాటసారి పాల్గొన్నారు.