టీ విత్ డాక్టర్ బాబు

రాజోలు నియోజకవర్గం, రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు ఉపాధి హామీ కూలీలను కలసి వారు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు, సుదీర్ఘంగా వారితో మాట్లాడి గాజు గ్లాసులో టీ అందరికి ఇచ్చి ఉపాధి హామీ కూలీల యొక్క ప్రధాన సమస్యలు, డిమాండ్లు అయిన

  • 100 పని దినాలను 200 రోజులకు పెంచాలని
  • రోజువారి కనీస వేతనం 272 రూపాయల నుండి 600 రూపాయలకు పెంచాలి
  • పనులు చేసే ప్రాంతంలో టెంట్లు ఏర్పాటు చేయాలి
  • పనిచేసే సమయంలో ప్రమాదం జరిగినా, గాయాలు తగిలినా వైద్యం కొరకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉండడం లేదు
  • కూలీలకు నగదు చెల్లింపులు సకాలంలో జరగడం లేదు కొన్ని సందర్భాల్లో మూడు నెలలు పడుతుంది
  • సొంత గ్రామాల్లో పనిచేయని సందర్భంలో వేరే గ్రామాలకు పనికి వెళ్లేటప్పుడు ప్రయాణం చార్జీలు సరిపోవటం లేదు అలవెన్సెస్ లను పెంచాలి.
    మొదలయిన సమస్యలపై చర్చించి, కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇతర కార్యక్రమాలకు వినియోగించడం వలన సకాలంలో నగదు చెల్లించడం లేదని డాక్టర్ రమేష్ బాబు అన్నారు. అంతేకాకుండా ఉపాధి హామీ కూలీల యొక్క డిమాండ్లను రాబోయే జనసేన-టిడిపి ఉమ్మడి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని డాక్టర్ రమేష్ బాబు గారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోదావరి జోన్ కో-కన్వీనర్ పినిశెట్టి బుజ్జి, జనసేన నాయకులు రావూరి నాగు, మల్కిపురం ఎంపీటీసీ జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్, ఉండపల్లి అంజి, బట్టేలంక ఎంపీటీసీ అవుపాటి శివజ్యోతి సుబ్రమణ్యం, రాపాక మహేష్, మెండు అంజన, మేడిచర్ల సత్య, మల్కిపురం మండల ఉపాధ్యక్షులు కుసుమ నాని, శంకరగుప్తం గ్రామశాఖ దూది శంకర్, ఉప సర్పంచ్ శిరిగినీడి నాని, ఎరుబండి శ్రీను, ఆచంట సతీష్, ఆచంట వీర్రాజు, ముత్యాల జగదీష్, ఆచంట సూర్య, రమేష్, దుర్గా ప్రసాద్, నాని, ప్రధాన కార్యదర్శి నల్లి పవన్ ప్రసాద్, అడబాల రత్నజ్యోతి, యమున తదితరులు పాల్గొన్నారు.