కౌలు రైతు భరోసా యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన చిట్వేలు జనసేన

ఉమ్మడి కడప జిల్లా, జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాలుగవ విడత కౌలు రైతుల భరోసా యాత్రను కడప జిల్లాలోని సిద్దవటంలో జరుగుతున్న సందర్భంగా గురువారం నాడు చిట్వేల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిట్వేలు జనసేన నాయకులు మాదాసు నరసింహ, సుధీర్ రెడ్డి పురం సురేష్, పగడాల శివ మాట్లాడుతూ 161 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని చనిపోయిన ప్రతి కౌలు రైతుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి తన చేతులు మీదుగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేయనున్నారు. అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గంలో 17 మంది ఆత్మహత్య చేసుకోగా చిట్వేలు మండలంలో ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఈనెల 20తేదీన భరోసా ఇవ్వడం జరుగుతుంది. జనసెన అధినేత పవన్ కళ్యాణ్ సహృదయంతో పెద్ద మనసుతో కౌలు రైతుల ఆత్మహత్య కుటుంబాలకి మీ వంతుగా చేస్తున్నా ఈ సాయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఎన్నో సందర్భాలలో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ రైతు పడే కష్టాలను ఎలా ఉంటాయో, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఎన్నోసార్లు చెప్పారు. రైతు లేనిదే రాష్ట్ర భవిష్యత్తు ఉండదు. చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేయాలన్న ఆలోచన రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు, ఉభయగోదావరి రాయలసీమలోని అనంతపురం కర్నూల్ జిల్లాలలో మరియు ప్రకాశం జిల్లాలో కౌలు రైతు భరోసా పూర్తి అయిన తర్వాత ప్రస్తుతం ఆరవ విడతగా రాయలసీమలోని ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని సిద్ధవటంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు వీర మహిళలు భారీగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్వేలు జనసేన పార్టీ నాయకులు తుపాకుల పెంచలయ్య, షేక్ రియాజ్, మాదాసు శివ, పగడాల భరత్, మురళీకృష్ణ, చిరంజీవి, నరసింహ, కడుమూరి నాగరాజా, మాదినేని హరి, నాగిశెట్టి శివకుమార్, తిరుమలశెట్టి హరి, పవన్, రాజు, సువారపు హరి తదితరులు పాల్గొన్నారు.