క్రిస్మస్ అందరి జీవితాలనీ కాంతిమయం చేయాలి

పిఠాపురం: ప్రేమని పంచే క్రీస్తు జన్మదిన పండుగకు క్రైస్తవ సోదర సోదరీమణులు సమాయత్తమవుతూ క్రిస్మస్ సంబరాలతో తమ సంతోషాన్ని కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి శివ మరియు జనసేన శ్రేణులతోను, బంధువులు చుట్టాలతో పంచుకుంటూ తమ హర్షాన్ని వ్యక్తం చేసారు. ఈ పండగ అందరి జీవితాలనీ కాంతిమయం చేయాలని ఆకాంక్షిస్తూ ప్రార్ధనలు చేస్తూ ప్రభువుని వేడుకున్నారు. జనసేన పార్టీని యేసు ప్రభు ఆశీర్వాదంతో అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, నాని, సోది కృష్ణవేణి, రాచపల్లి సత్యవతి,
బొండు పార్వతి, తదితరులు పాల్గొన్నారు.