మహాత్మునికి లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి ఘన నివాళి

  • లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి సొంత నిధులతో రోడ్డుకు మరమ్మత్తులు

అనంతపురం, జాతిపిత మహాత్మాగాంధీ జయంతి మరియు లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి మరియు లాల్ బహుదూర్ శాస్త్రికి, పాలాభిషేకం, పూలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతపురం నియోజకవర్గంలో జే.ఎన్.టి.యు కాలేజ్ మొదటి గేట్ ముందు ఉన్న మెయిన్ రోడ్ లో అతి ప్రమాదకరమైన గుంతలు పడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ప్రజలు ఇక్కట్లను గమనించి ప్రజల సౌకర్యార్థం లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి సొంత నిధులతో రోడ్డుకు మరమ్మత్తులు చేయడం జరిగింది. మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి స్ఫూర్తితో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనలో భాగంగా జనసేన పార్టీ తరపున సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డితో పాటు అనంతపురం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరి, తాడిపత్రి ఇన్చార్జి కడపల శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఐటి అధ్యక్షులు శ్యాంసుందర్, అనంతపురం నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, అనంతపురం జిల్లా కార్యదర్శి చొప్ప చంద్ర, పురుషోత్తం రెడ్డి, మెరుగు శ్రీనివాస్ పుట్టపర్తి ఐటి కోఆర్డినేటర్ విష్ణువర్ధన్, ఉరవకొండ ఐటి కోఆర్డినేటర్ సుదీర్, అనంతపురం జిల్లా ఐటి విభాగం సభ్యులు గిరిప్రసాద్, లక్ష్మీనరసప్ప, నగర ప్రధాన కార్యదర్శి ధరాజ్ బాషా, పాలగిరి చరణ్ తేజ, ఊటూరు జయకృష్ణ, భవాని నగర్ మంజునాథ్, తోట మోహన్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.