నగరం భాస్కర్ బాబుకి సుప్రీం కోర్టులో ఊరట

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి నియోజకవర్గం జన సేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారి తండ్రి నగరం భాస్కర్ బాబు గారికి సుప్రీం కోర్టులో ఊరట లబించింది. మార్చ్ 29న చిందేపల్లి గ్రామ రోడ్డు సమస్య కోసం నిరాహార దీక్ష చేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటాతో పాటు వారి భర్త, తల్లి తండ్రులతో పాటు 20 మంది నాయకులు, గ్రామస్థులపై పోలీసులు 14 సెక్షన్లు 307 & ఎస్సీ/ఎస్టీతో అక్రమ కేసులు పెట్టడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ప్రోద్భలంతో పోలీసులు పథకం ప్రకారం 307, ఎస్సీ/ఎస్టీ సెక్షన్లు పెడుతూ, ఉద్దేశ పూర్వకంగా కంప్లైంట్ లో వినుత భర్త, తండ్రిపై డైరెక్ట్ అభియోగాలు పెట్టడంతో ముందస్తు బెయిలు రానివ్వకుండా హై కోర్ట్ నందు ఈ వైసీపీ ప్రభుత్వం తరఫున తీవ్రంగా అభ్యంతరాలు పెడుతూ 3 సార్లు హై కోర్టు నందు బెయిల్ డిస్మిస్ అయ్యేలా చెయ్యడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టులో వినుత తండ్రి భాస్కర్ బాబు గారికి సోమవారం బెయిలు మంజూరు కావడంతో 5 నెలల తరువాత స్వగ్రామం రేణిగుంటకి రావడంతో జనసేన పార్టీ నాయకులు, భాస్కర్ శ్రేయోభలాషులు పెద్ద ఎత్తున రేణిగుంట యన్.టి.ఆర్ సర్కిల్ వద్దకి విచ్చేసి పూలమాలలతో దుస్సాలువతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి పాలూరు మునికుమార్, మండల ఉపాధ్యక్షులు వాకాటి బాలాజీ, నాయకులు దేవలం జగదీష్, పార్థసారథి, త్యాగరాజులు, భాగ్య లక్ష్మి, ఉమామహేశ్వరి, జ్యోతి కుమార్, తోట ముకేష్ ,పసుపులేటి మునిరత్నం, నాథముని, వెంకటేష్ జనసైనికులు రాజ్ కుమార్, గాంధీ, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.