జనసేనాని జన్మదిన వారోత్సవాల్లో భాగంగా యువతికి ఆర్థిక సాయం

నెల్లూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మంగళవారం వైద్య ఖర్చులకోసం జనసేన నాయకులు ఓ యువతికి ఆర్థిక సాయం అందచేశారు. ఈ సందర్బంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్ర శేఖర్ మాట్లాడుతూ జనసేన కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు పలు సామజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా చిల్లకూరు మండలం, తిక్కవరం గ్రామానికి చెందిన తేజస్విని వైద్యఖర్చుల కోసం శ్రీరామ్ మనోహర్, యస్వంత్ కుమార్ ల సహకారంతో 10 వేలు అందచేయడం జరిగిందన్నారు. దాతలు సహకరించి తేజస్వినికి ఆర్థిక సాయం అందచేయాలని కోరారు. అనంతరం చిల్లకూరు మండల ప్రధాన కార్యదర్శి, నాయకులు మనోజ్ కుమార్, కార్తీక్, సుధీర్ లు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేయడంలో జనసైనికులు ముందు ఉంటామని, పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని సెప్టెంబర్ 1న చింతవరంలో జరిగే మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి సేవా సంఘం అధ్యక్షులు మా బాషా, జనసేన నాయకులు శ్రీనాథ్, అవినాష్, వంశీ, మహేష్, ప్రభాకర్ లు ఉన్నారు.