మాధవ్ బాబా రాసలీలపై సీఎం గారు వివరణ ఇవ్వాలి: ఎస్ వి బాబు

25 మంది ఎంపీలను మన పార్టీ గెలుచుకుంటే కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాను ఆ రోజు జగన్ రెడ్డి ప్రకటించారు. ఈరోజు వైసిపి పార్టీ ఎంపీ బట్టలూడదీసుకుని న్యూడ్ వీడియోలతో అడ్డంగా బుక్ అయిపోయారు.

గతంలో అవంతి, అంబటి రాసలీల ఆడియో రికార్డులు బయటకు వచ్చినప్పుడు ఇదే విధంగా ఆ వాయిస్ నాది కాదు అని బుకాయించడం జరిగింది. ఫోరెన్సీ ల్యాబ్ పంపించి నిజాలు బయట పెడతామని చెప్పి, పరువు పోతుందని మిన్నకుండటం జరిగింది.

ఇప్పుడు గోరంట్ల కూడా అదే బాటలో ఆ వీడియోను మార్ఫింగ్ చేశారని ఫోరెన్సి ల్యాబ్ కి పంపిస్తే నిజా నిజాలు బయటపడతాయని బుకాయించడం జరుగుతుంది.

గోరంట్ల మాధవ్ గురువారం ప్రెస్ మీత్లో మాట్లాడుతూ తన జిమ్ చేస్తున్న ఫోటో ఒకటి చూపించడం జరిగింది. ఆ వీడియోలో మాధవ్ యొక్క వెనుక భాగాన్ని చూపిస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఒక మహిళతో మాధవ్ న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు ఉంది.
నిజాన్ని నిగ్గు తేల్చవలసిన అవసరం ఎంతైనా ఉంది.

గురువారం ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న గోరంట్ల మాధవ్ ముఖంలో కాన్ఫరెన్స్ లేదు. తప్పుచేసి బుక్కఇస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.

ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి జరిగిన సంఘటనకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు వివరించాలి. మీ పార్టీ ఎంపీ మీద వచ్చిన ఆరోపణ ఆషామాషీ ఆరోపణ కాదు. (ఒకవేళ ఎంపీ న్యూడ్ గా ఒక మహిళతో వీడియో మాట్లాడటం సభ్య సమాజం తలదించుకునే విషయం అవుతుంది)

గోరంట్ల మాధవ్ మీద గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. మహిళలను మోసగించారని, ఒక మహిళపై హత్యాచారం కేసులో ముద్దాయి కూడా.

నిజానికి గోరంట్ల మాధవ్ విషయంలో వైసిపి పార్టీ చర్యలు తీసుకుంటుందా లేదా మాధవ్ కి ప్రమోషన్ ఇచ్చి మంత్రి పదవిస్తుందా? వేచి చూడవలసిన విషయం

ఎందుకంటే అంబటి విషయంలో ఇదే జరిగింది. ఆడవాళ్ళతో అశ్లీలతగా మాట్లాడి అడ్డంగా దొరికిపోయిన గాని మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు.

ప్రతిపక్ష నాయకుడు పై దుమ్మికి వెళ్ళిన జోగి రమేష్ కి కూడా మంత్రి పదవి ఇచ్చి రుణం తీర్చుకున్నారు.

ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఎలాంటి వ్యక్తులకు మన ఓటు వేశాం. వారు చేస్తున్నది ఏమిటి? ఇలాంటి వ్యక్తుల వల్ల మన రాష్ట్రానికి తద్వారా ఈ సమాజానికి ఎలాంటి మేలు జరుగుతుందో ఆలోచించవలసిన సమయం ఆసన్నమైందని పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు అన్నారు.