కాపు నేస్తం వేదిక సాక్షిగా సీఎం జగన్ రెడ్డి కాపులను అవమానించారు: కొట్టే శ్రీహరి

కాపుల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం 2 వేల కొట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ క్రింద ఇస్తాం అని చెప్పి కాకి లెక్కలు చెబుతున్నారు ముఖ్యమంత్రి గారు. గత 3 సంవర్సరాలలో కాపులకు ఏమి చేశారు శ్వేతపత్రం విడుదల చెయ్యండి. సీఎం జగన్ రెడ్డి గారు వివిధ పథకాలలో ఇచ్చే డబ్బులను కాపు కోటలో చూపిస్తున్నారు. ప్రత్యేకంగా కాపులకు ఇచ్చినట్లు ఈ.బి.సీ కోటలో కాపులకు రిజర్వేషన్ తొలగించి కాపులకు ద్రోహం చేసింది చాలక, కాపులు అమ్ముడుపోతారు అని చెప్పి కాపులను అవహేళన చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాపులకు క్షమాపణ చెప్పలని తన‌ మాటలను వెనుకకు తీసుకోవలని జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి డిమాండ్ చేశారు.

ఈ మధ్య సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడనికే కార్యక్రమలు నిర్వహిస్తున్నట్లు వున్నారు. ప్రతి సభలో పవన్ కళ్యాణ్ గారి నామ జపమే. జనసేన అధ్యక్షులు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీ చేతకాని పరిపాలనలో 3,000 మందిపైగ కౌలు రైతులు చనిపోతే వైసీపీ ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకోక పోతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తన కష్ట జీతం నుంచి అక్షరాల రు.30 కొట్ల రూపాయలు చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున అర్థిక సాయం అందిస్తూ వుంటే.. ఆయనను ఎవరికో దత్తపుత్రుడు అని మాట్లాడటం సీఎం జగన్ మోహన్ రెడ్డి దిగజారుడుకి ఇది నిదర్శనం అని కొట్టే శ్రీహరి ఎద్దెవా చేసారు.