జస్టిస్‌ ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమీణ స్వీకారం చేసిన జస్టిస్‌ ఎన్వీ రమణకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్‌ రమణ సుదీర్ఘ అనుభవం, ఆయన అంకిత భావం దేశానికి ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు. ఆయన పదవీకాలం విజయవంతం కావాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.