పవన్ ప్రశ్నలకు దమ్ముంటే సీఎం సమాధానం చెప్పాలి

  • ఎఫ్ ఓ ఏ కంపెనీ ఎవరిదని?
  • సీఎం వెంకటగిరికి వస్తే తిరుపతిలో హౌస్ అరెస్ట్ లా..?
  • జనసేన నేత రాజా రెడ్డి

తిరుపతి: ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు దమ్ము, ధైర్యం ఉంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని.. జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు జనసేన నాయకులు రాజేష్ యాదవ్, బాబ్జి, రాజమోహన్, మునస్వామి, సాయిదేవ్, గుట్టా నాగరాజు, సుమన్, మనోజ్, ఆది కేశవులు తదితరులతో కలిసి రాజారెడ్డి మాట్లాడుతూ.. జులై 21న శుక్రవారం వెంకటగిరికి నేతన్న నేస్తం కార్యక్రమానికి విచ్చేసిన సీఎం జగన్ తమ జనసేనాని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం లేక తమ పవన్ పై లేని పోనీ పేలాపనలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా వైసిపి వాలంటరీలు సేకరిస్తున్న సమాచారం అంతా హైదరాబాద్, నానక్ రామ్ గూడా, ఎఫ్ ఓ ఏ కంపెనీలో ఎందుకు ఉందని, ఆ కంపెనీ ఎవరిదని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పగలిగే దమ్ము వైసీపీకి ఉందా అన్నారు. వాలంటరీలు కొంతమంది మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు చేయడం, వేధింపులకు పాల్పడడం, వివాహితుల కాపురాలు కూల్చడం నిజం కాదా అన్నారు. వాలంటీర్లు సేకరిస్తున్న డేటా దుర్వినియోగం అవుతుంటే, ఏ అధికారి లేదా ఏ మంత్రి బాధ్యత తీసుకుంటాన్నా రన్నారు. ప్రతి వ్యక్తి ఆధార్, బ్యాంకు అకౌంటు, దీనితోపాటు ఎవరెవరు ఎక్కడికెళ్తున్నారు, ఏ పని మీద వెళ్తున్నారు, తదితర వివరాలు ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. వాలంటరీలకు ఐడి కార్డులు ఇవ్వకపోవడంలో మర్మం ఏమిటన్నారు. ఇంత తతంగం జరుగుతుంటే మహిళలు అదృశ్యం అవుతుంటే.. ఇంత సీరియస్ విషయాన్ని మా జనసేనాని ప్రశ్నిస్తే ..
ఈ దారుణాలను మరుగున పెట్టేందుకు.. సీఎం జగన్ ప్రజలకు పనికిరాని ప్రస్తావనలు మాట్లాడడం పట్ల.. ప్రజలు కళ్ళు తెరవాలని కోరారు. బెంగుళూరు ప్యాలెస్ లో జగన్ తో పాటు మంత్రుల రాసలీలలపై.. కర్ణాటక కీలక కాంగ్రెస్ నాయకుడు ఈ విషయాన్ని బయట పెట్టకుండా ఉండేందుకు వందల కోట్ల ముడుపులు ఇవ్వడానికి సంబంధించిన పూర్తి వివరాలను.. త్వరలో బహిర్గతం చేస్తామన్నారు తల్లి, చెల్లిని బయటికి గెంటేసిన దుర్మార్గుడు జగన్ కెమెరాల ముందు నీతులు చెబుతున్నాడు. కెమెరాల వెనక ఆయన రాక్షసత్వంతో కూడిన దుర్మార్గపు చిట్టాలన్ని తమ వద్ద ఉన్నాయని, సాక్షాదారాలతో సహా త్వరలో బయట పెడతామని హెచ్చరించారు. జగన్ ఓటమి ఆయన కళ్ళల్లో కనిపిస్తున్నదన్నారు. అందుకే జగన్ సందీ ప్రేలాపనలు పేలుతున్నాడన్నారు.