మెగాస్టార్ కు కళాకృతిని కానుకగా పంపిన కలెక్షన్ కింగ్

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకను శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖుల తో పాటూ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ చిరంజీవి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నేపధ్యంలో చిరంజీవి తనకు మోహన్ బాబు ఇచ్చిన కానుకను ట్విట్టర్‌లో ప్రదర్శించారు. అది చెక్కతో చేసిన హార్లే డేవిడ్సన్ బైక్ నమూనా. దీనిపై మెగాస్టార్ హర్షం వ్యక్తం చేశారు.

“నా చిరకాల మిత్రుడు తొలిసారిగా నా పుట్టినరోజు నాడు ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి… థాంక్యూ మోహన్ బాబు” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి… … … Thank you