రెండేళ్ళలో కరోనా అంతం: WHO

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జనరల్ డైరక్టర్ టెడ్రోస్ అథనోమ్ కరోనా మహమ్మారిని మరో రెండేళ్లలో కట్టడి చేసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఈ మహమ్మారి వల్ల మనకు ఆరోగ్యం, ఆర్థిక విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో నేర్పింది అని ఆయన పేర్కొన్నారు.

కోవిడ్-19 సంక్రమణను నిరోధించడానికి ప్రపంచం మొత్తం లాక్ డౌన్ ను ప్రకటించడాన్ని ఆయన ప్రశంసించారు. అయితే లాక్ డౌన్ అనేది శాశ్వత పరిష్కారం కాదు అని కూడా ఆయన తెలిపారు.

ప్రతీ దేశం, ప్రతీ పౌరుడు, ప్రతీ సంస్థ, ప్రతీ సమాజం తమ స్వీయక్రమశిక్షణతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అన్నారు టెడ్రోస్. కోవిడ్-19 వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రస్తుతం పరిశోధనలు వేగం పుంజుకున్నాయి అని రానున్న రెండు సంవత్సరాల్లో కరోనావైరస్ కథ ముగిసిపోతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.