‘కలర్ ఫోటో’ టీజర్‌ సూపర్

సందీప్ రాజ్ అనే ఓ కొత్త దర్శకుడు సుహాస్‌ని(మజిలీ సినిమాలో చైతూకి స్నేహితుడి పాత్రలో నటించి మెప్పించిన)  హీరోగా పరిచయం చేస్తూ అమృత ప్రొడక్షన్స్ రూపొందిస్తున్న కలర్ ఫోటో మూవీ టీజర్‌కి  ఆడియెన్స్ నుండి మంచి స్పందన వచ్చింది.

విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదలైన కలర్ ఫోటో టీజర్‌‌ విడుదలైన 12 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్‌కిపైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఒక సాధారణ ఆర్టిస్టుని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న సినిమా టీజర్‌కి ఈ స్థాయిలో స్పందన కనిపించడం చాలా అరుదు.