దమ్ముంటే రా తేల్చుకుందాం.. దువ్వాడ శ్రీనివాస్ కి గర్భాన సత్తిబాబు ఛాలెంజ్

శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు పాలకొండ నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ లో దువ్వాడ శ్రీనివాస్ గురించి గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ.. దూల శ్రీనివాస్ నోటిధురుసు తగ్గించుకోవాలని, ఎమ్మెల్సీగా ఆయన ప్రజలకు చేసేది ఏమీ లేదు అని, ప్రజల సంపదను దోచుకు తింటూ ఎన్నో నేర చరిత్ర కేసులకు చిహ్నంగా దూల శ్రీనివాస్ మారారని, దూల శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకోకపోతే చాలా తీవ్ర స్థాయిలో పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.