గడపగడపకు వస్తున్న ఆళ్ళనానినీ నిలదీయండి – రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేసి 3 సం.ల 2 నెలలు ఏలూరు నియోజకవర్గం లోని ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించుకున్న శాసనసభ్యులు ఆళ్ళనాని గారు జనసేన పార్టీ యొక్క ఉద్యమ పటిమతో, ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట అనే ఉద్యమాన్ని ప్రారంభించిన తరువాత అధికార పార్టీలో కదలిక వచ్చింది అని ఆయన అన్నారు..ఈనెల 8 వ తేదీ నుండి ఆళ్ళనాని గారు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం చేపడుతున్నారు అని పేపర్ ద్వారా నే తెలిసింది.. దీనికి ఎంతగానో సంతోష పడుతున్నాం.. ఏలూరు నియోజకవర్గ ప్రజానీకానికి ఒకటి మనవి చేస్తున్నాను ఇప్పుడున్న రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇళ్ళు కట్టుకోవడానికి వీలు లేకుండా, హౌసింగ్ లోన్ రాకుండా అధికార పార్టీ నాయకులు చేస్తున్నారు.. ఏలూరు కార్పోరేషన్ పై వస్తున్న అవినీతి ఆరోపణలు మీద స్పందించడానికి తీరిక లేదు గాని రాష్ట్రం అంతా ఒక పాలసీ ఉంటే ఏలూరు నియోజకవర్గానికి మాత్రం అనాదిగా ఒక ఆచారం వస్తుంది.. ఇక్కడ అధికార పక్షం, ప్రతి పక్షం రెండు పార్టీలు కూడా కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికొదిలేసిన పరిస్థితి చూస్తున్నాం..ఈ రెండు పార్టీలు కూడా నీది తెనాలి నాది తెనాలి అనే రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు.. ఇప్పుడు దీనిని బాధ్యత గా చేసుకొని ఏలూరు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా గడప గడపకు వస్తున్న నాని గారిని నిలదీయండి..ఏలూరు నియోజకవర్గం లో డ్రైనేజీ లు ఎక్కడికక్కడే తవ్వేశారు.. కన్స్ట్రక్షన్ లేదు.. వాటర్ సప్లయ్ లేదు..ఎల్ ఇ డి లైట్లు వెలిగే పరిస్థితి లేదు.. ఎక్కడ బ్లీచింగ్ జల్లిన దాఖలాలు లేదు.. ఇన్ని రకాల సమస్యలతో సతమతమవంతుంటే నియోజకవర్గానికి పెద్ద దిక్కైన జ్యూట్ మిల్లును మూతవేసిన ఘనత కూడా నాని గారికే దక్కుతుంది.. కనీసం తెరిపించే సామర్థ్యం లేకుండా చేస్తున్నారు..ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర గా వస్తున్నారు అని నిలదీయండి.. ఏలూరు నియోజకవర్గం లో జనసేన పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు..

ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు తదితరులు పాల్గొన్నారు..