పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడని నిరూపించి మీ మగతనం నిరూపించుకోండి

అనంతపురం, నేటి నుంచి పవన్ కళ్యాణ్ ని ఎవరన్నా ప్యాకేజీ తీసుకున్నారు, మూడు పెళ్లిళ్లు అంటే… జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కేవలం చెప్పు మాత్రమే చూపించి కొడకల్లారా అని మాట్లాడారు. అధికార మదమెక్కి నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడారంటే మేము చెప్పు తీసుకొని కొడతామని హెచ్చరిస్తున్నాం. మరీ ముఖ్యంగా అనంతపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మంత్రి ఉషశ్రీ, రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, మాజీ మంత్రులు కన్నబాబు, పేర్ని నేని, నోరు అదుపు లేకుండా మాట్లాడుతున్న తదితర వైఎస్ఆర్సిపి మంత్రులు ఎమ్మెల్యేలు మీకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు, మీకు చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడని నిరూపించి మీ మగతనం నిరూపించుకోండి లేదంటే నోరు మూసుకొని ఉండండి. మీకు చాతనైతే ఇంకా ఒకటిన్నర సంవత్సరం టైం ఉంది అభివృద్ధి చేసి చూపించండి, మూడు రాజధానులు నిర్మించి చూపించండి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని వట్టి మాటలు మాట్లాడొద్దని హెచ్చరిస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి అన్నారు.