నిరుద్యోగ యువత తమ గళాన్ని వినిపించేందుకు యువశక్తి కార్యక్రమానికి రండి

నెల్లూరు, కలలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్న యువతకుముందు ఉద్యోగ అవకాశాలు కల్పించక మొండి చేయి చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసనలు సైతం తెలిపేందుకు అనుమతి ఇవ్వని వైనాన్ని ఎండ కడుతూ యువత గళాన్ని వినిపించేందుకు రణస్థలంలో ఈ నెల 12వ తేదీన జరగనున్న పవన్ కళ్యాణ్ అధ్యక్షతన యువశక్తి కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా పిలుపునిస్తూ జిల్లా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆదివారం మధ్యాహ్నం స్థానిక బోసు బొమ్మ సెంటర్ వద్ద పోస్టర్ లాంచ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

  • అడ్డగోలుగా రాష్ట్ర విభజన అయి పేర్లు కావస్తున్నా అభివృద్ధి శూన్యం కొత్తగా వచ్చిన కంపెనీలు లేవు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ప్రత్యేక జాబ్ క్యాలెండర్ లో లేవు యువత గౌరవంగా బతకాలంటే రాష్ట్రాన్ని కుటుంబాన్ని రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
  • యువతకు స్ఫూర్తినిచ్చిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద జయంతి యువ దినోత్సవ సందర్భంగా ఉత్తరాంధ్రలోని రణస్థలం వద్ద యువత గళం వినేందుకు పవన్ కళ్యాణ్ సభకు విచ్చేస్తున్నారు.
  • రాష్ట్రవ్యాప్తంగా యువత పాల్గొని తమ గళాన్ని వినిపించాల్సిందిగా కోరుతూ యువశక్తి పోస్టర్ లాంచ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో కంథర భాయ్, ప్రశాంత్ గౌడ్, హేమంత్ యాదవ్, వర్షన్, ప్రతాప్, పవన్ తదితర యువత పాల్గొన్నారు.