జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గం జనసేన క్రియాశిలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర నాయకులు రామ్ తల్లురి పిలుపు మేరకు బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా, నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న సభ్యులకు కిట్ల పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ ఎం.డి మహబూబ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా
లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ.. గద్వాల్ జిల్లా, నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి ఒక్క సభ్యునికి, సభ్యత్వాలు నమోదు చేయించిన ప్రతి ఒక్క కో-ఆర్డినేటర్స్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు..

అదే విధంగా గద్వాల జిల్లాలో పార్టీ బలోపితం కోసం, కార్యకర్తలు బలంగా ముందుకు రావాలి ఎందుకంటే అందరి పార్టీల నాయకులు కార్యకర్తలను వారి రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారు. ఒక్క జనసేన పార్టీ మాత్రమే కార్యకర్తల యోగక్షేమాలు చూస్తుంది. అలాంటిదే మన ఈ క్రియాశీలకసభ్యత్వం అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన, యువత పక్షాన, అన్నింటిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. దీన్ని ఎదురుకోవడానికి ప్రతి ఒక్క జనసైనికుడు ఒక్కో పవన్ కళ్యాణ్ గారిలా సమాజశ్రేయస్సు కోసం పిడికిలి బిగించి, కదం కదలాలి అని ధైర్యాన్ని ఇచ్చారు.

మరియు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదట జనసేన పార్టీ నుంచి, “జనంలోకి జనసేన అనే పేరుతో పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా అనే పదంతో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేయడం జరుగుతుంది దానికి మీ అందరి ఆశీస్సులు కావాలి అని కోరారు.

అదేవిధంగా గద్వాల్ గడ్డ మీద మహబూబ్ ఆధ్వర్యంలో జనసేన జెండా బలంగా ఎగరాలి.. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ గెలుపు ప్రస్థానం మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచే మొదలుకావాలి. కచ్చితంగా మొదలుఅవుతుంది. భవిష్యత్తులో తెలంగాణ గడ్డ మీద మన జనసేన జెండా రేప,,రేప,,రెప,,రెపలాడుతూ ఎగరాలి అని జనసైనికుల్లో జోష్ నింపారు.

ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యూత్ వింగ్ అధ్యక్షులు బైరపోగు సాంబశివుడు, జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యూత్ వింగ్ ఉపాధ్యక్షులు ఎమ్ రెడ్డి రాకేష్ రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా నాయకులు
కోడిగంటి సాయి, సూర్య, ఎడ్ల శివ, గద్వాల్ జిల్లా నాయకులు, జగదీష్, వెంకటేశ్, శవ, సిద్దు, మొయిన్, యుగేందర్, శేకర్, తిరుమల్, అంజి, జానీ, పల్లేష్, రాజు, ప్రేమ్, సంతోష్,
మరియు జిల్లా జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..!