డిఎస్‌సిపై త్వరలోనే నిర్ణయం: ఎపి విద్యాశాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డిఎస్‌సి, డిఎస్‌సి, టెట్‌ నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. తెలుగు, రాష్ట్ర స్థాయి విద్యకు ప్రాధాన్యత ఇస్తూనే సిబిఎస్‌ఇ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. గతేడాది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారని వెల్లడించింది. ఇప్పటికే 45 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని.. కొత్తగా మరో 5 లక్షల మంది చేరారని వెల్లడించింది. ప్రతి విద్యార్థికి పుస్తకాలు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, దీనికి అనుగుణంగా ఏటా సెప్టెంబరులో 5 శాతం అదనంగా పాఠ్య పుస్తకాలను ముద్రిస్తామని పేర్కొంది.