సమాజ సేవకు పునరంకితం కావాలి: గురాన అయ్యలు

విజయనగరం: సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఇతరులకు ఆదర్శంగా నిలవాలని జనసేన నాయకుడు గురాన అయ్యలు అన్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకల్లో భాగంగా గురువారం పినవేమలి ఏబిసిడి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే విజయనగరం పట్టణ నిరాశ్రయుల వసతి గృహములో పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ సంపాదనకే రాజకీయాలు పరిమితమైన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమాజసేవలో పునరంకితం కావడం అభినందనీయమన్నారు. ఆయన స్ఫూర్తితో పేద ప్ర‌జ‌ల‌కు అభివృద్ధి ఫ‌లాలు అందేలా జ‌న‌సేన కార్య‌క‌ర్తలు కృషిచేయాల‌ని దిశానిర్దేశం చేశారు. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌డుతూ.. ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచి పోరాటాలు చేయాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌జ‌ల‌కు ఏది కావాలో అది తెల్సుకుని ప్ర‌భుత్వం అమ‌లుచేసేలా ఒత్తిడి తేవ‌డంలో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ముందుండాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు చక్రవర్తి, మాతా గాయిత్రి, టి.రామకృష్ణ(బాలు), వజ్రపు నవీన్, పవన్ కుమార్, భార్గవ్, అడబాల వేంకటేష్, సాయి, సురేష్ కుమార్, అప్పలనాయుడు, సయ్యద్ బుఖారి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.