జనసేనాని పుట్టినరోజు సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం

గజపతినగరం నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వారోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఉచిత మెగా వైద్య శిబిరం గజపతినగరం మండలం, పాతబగ్గం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. 3వరోజు జరిగిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో 103 మంది రక్త దాతలు రక్తం అందించారు. 4వ రోజు శాంతి నివాస్ ఆశ్రమంలో రాత్రి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డా.మౌనిక గైనకాలజిస్ట్, డా.ప్రశాంత్ జనరల్ ఫిజీషియన్, చిన్నపిల్లల వైద్యులు, గర్భకోస వైద్యులు, ఆర్థోపెటిక్, కంటి వైద్య నిపుణులు, వైద్యులచే వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది, ఉచితంగా షుగర్, బిపి పరీక్షలు, మందులు పంపిణీ చేయడం జరిగింది, సురేష్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయంతో అయితే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారో, ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో, ఆయన ఆలోచన అనుగుణంగా ప్రజాసేవ కార్యక్రమాలు నిత్యం చేస్తున్నాము గ్రామీణ ప్రాంతంలో సరైన వైద్య సదుపాయం లేక మధ్యతరగతి కుటుంబాలు సమస్యలపై నిత్యం బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికోసం ఈ ఉచిత మెగా వైద్య శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతన, రమేష్ రాజు, గజపతినగరం నాయకులు, శ్రీను, పీరు, సాయి, జగదీష్, గౌరీ నాయడు, పండు, మహేష్, ఆదినారాయణ, లక్ష్మణ, అశోక్, అనిల్, భాను, చరణ్, చలం కార్యకర్తలు పాల్గొన్నారు.