రైతులకు పరిహారం చెల్లించాల్సిందే.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

గతేడాది వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.. నష్టపోయిన రైతులకు 3 నెలల్లో ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాలని స్పష్టం చేసింది.. నాలుగు నెలల్లో బీమా సొమ్ము కూడా చెల్లించాలని ఆదేశించిన కోర్టు.. నష్టపోయిన కౌలుదారులకు కూడా పరిహారం, బీమా చెల్లించాలని పేర్కొంది.. పంట దెబ్బతిన్న రైతులను కూడా గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది.. రైతు స్వరాజ్య వేదిక విస్సా కిరణ్ కుమార్, రవి కన్నెగంటి, ఎస్.ఆశలత పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ తీర్పు వెలువరించింది.. తెలంగాణలో గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.