భూమి కోల్పోయిన రైతలకు నష్టరిహారాన్ని తక్షణమే చెల్లించాలి

🔸 పోలవరం ప్రాజెక్టు కాలువ వలన భూమి కోల్పోయిన రైతలకు ఎకరాకు 40 లక్షలు నష్టరిహారాన్ని చెల్లించాలి
🔸 తోటపల్లి నీరు తక్షణమే విడుదల చేసి చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గ రైతులను ఆదుకోవాలి
🔸 రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన తరుపున పోరాటం చేస్తామని తెలిపిన నాయకులు ఆదాడ మోహనరావు, దంతులూరి రామచంద్రరాజు

చీపురుపల్లి నియోజకవర్గం, గుర్ల మండలంలో కొండగండ్రెడు, ముద్దాడ పేట, పల్ల పేట, పతిగిరి గిట్లలో, పోలవరం ప్రాజెక్టు సుజలధార కాలువ వలన భూమి సుమారు 180 ఏకరాల భూమిని రైతులు కోల్పోయి, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకుండా, రైతులు కష్టాల్లో ఉండగా… రైతులకు అండగా నిలుస్తామని గురువారం ఉదయం ఆయా గ్రామాల్లో జనసేన పార్టీ నాయకులు దంతులూరి రామచంద్ర రాజు, ఆదాడ మోహనరావు, వంక నరసింగరావు రైతులతో సమావేశాలు నిర్వహించి, రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించే వరకు జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భగా నాయకులు రామచంద్రరాజు, ఆదాడ మోహనరావు మాట్లాడుతూ సుజలధార కాలువ ద్వారా భూమి కోల్పోయిన రైతులకు ఏకరాకు 40 లక్షలు నష్టరిహారాన్ని ఇవ్వాలని, అలాగే తోటపల్లి నీరును తక్షణమే విడుదల చేసి, చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారం చెల్లించి, రైతులకు న్యాయం జరిగేవరకు జనసేన తరుపున పోరాటం చేస్తామని తెలిపారు.