రైతులకు నష్టపరిహారం చెల్లించాలి: జనసేన డిమాండ్

పెడన నియోజకవర్గం: పెడన పరిధిలోని గూడూరు మండలం, పెడన మండలలో జూలై నెలలో కురిసిన వర్షాల కారణంగా మరియు లజ్జబండ మురుగు కాల్వలు గత మూడు సంవత్సరాల నుండి పూడిక తీయని కారణంగా నష్టపోయిన 4000 ఎకరాల రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 10000ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని మచిలీపట్నం కలక్టరేట్ నందు వినతి పత్రం అంజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు జనసేన అధ్యక్షులు దాసరి ఉమా సాయిరామ్ మరియు పెడన మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఊచా వెంకయ్య పాల్గొన్నారు.