ఉప్పరపల్లిలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

  • నేతన్నలను సన్మానించిన జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

రాజంపేట నియోజకవర్గం: ప్రపంచ జాతీయ చేనేత కార్మికుల దినోత్సవాన్ని సిద్ధవటం మండల పరిధిలోని ఉప్పరపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుగురు చేనేత కార్మికులను శాలువా వేసి ఘనంగా సన్మానించారు. రామయ్య మాట్లాడుతూ.. భారతదేశ చేనేత పరిశ్రమను అభివృద్ధి పరచటానికి ప్రతి ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ, చేనేత దుస్తులు ధరించి చేనేత పరిశ్రమను ఆదుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకుడు పసుపులేటి కళ్యాణ్, చేనేత కార్మికులు, జనసేన వీరమహిళలు పాల్గొన్నారు.